Mahanati: గుడి లేని దేవత

ప్రతి కథకు ఒక ప్రారంభం కావాలి. ఆ ప్రారంభానికి ఒక ప్రేరణ కావాలి.
మహానటి సినిమాను తెరకెక్కించడానికి కూడా ఒక ప్రేరణ ఉంది. తెలుగు రచయితలను, సినిమా ప్రముఖులను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయం చేసే కిరణ్ ప్రభా గురించి సాహితీ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎందరో సినీ ప్రముఖులను పరిచయం చేసినట్లే దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం “మహానటి” సావిత్రి గారి గురించి కూడా “కిరణ్ ప్రభా” పరిచయం చేసారు. దాదాపు 6 గంటలు పాటు ఈ కథను విన్న నాగ అశ్విన్ దీనిని సినిమాగా మలచాలి అనుకున్నాడు.

అక్కడే మహానటి సినిమాకు బీజం పడింది. ప్రేక్షకులకు కథను చెప్పడం వేరు. కళ్ళకి చూపించడం వేరు. ఆ కథను మన మనసుకు హత్తుకునేలా చేస్తూ, మనతో కొన్నేళ్లు పాటు ప్రయాణించేలా చేయడం ఇంకా అరుదైన విషయం. ఆ విషయంలో నాగ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈ రోజు మనం ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. మహానటి కేవలం కథ కాదు.. జీవితం. పేర్లు కూడా పలకలేని ఫారెన్ యాక్టర్స్ గురించి మొత్తం తెలుసుకుంటాం కానీ మనకు ఎంతో సేవ చేసిన చిత్తూరు నాగయ్య, కన్నాంబా, సావిత్రి లాంటి వాళ్ళ గురించి ఏమీ తెలియని దుస్థితిలో ఉన్న మనలను మహానటి సినిమా కళ్ళు తెరిపించింది.
కళ్ళు చెమర్చేలా కదిలించింది.

బాగ్ మిల్కా బాగ్, మేరీ కోమ్, దంగల్ , సంజూ భాయ్ లాంటి ఎన్నో బయోపిక్ బాలీవుడ్లో తెరకెక్కాయి. కానీ వీటిని మించిన ఒక బయోపిక్ మహానటి రూపంలో తెలుగులో తెరకెక్కింది అంటే అతిశయోక్తి కాదు.
మహానటి బాల్యం, సినిమా అవకాశాలు, తను చూసిన శిఖరం, తను పడిపోయిన పాతాళం, తను చేసిన సేవలు, తను చూసిన మోసాలు అన్నిటిని చూపించి వెండితెరపై ఒక అద్భుతాన్ని లిఖించాడు నాగి.

- Advertisement -

సినిమాలో ప్రతి ఫ్రేమ్, ప్రతి సౌండ్, ప్రతి పాత్ర కూడా కథను చెప్తాయి.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా సంభాషణలు. ప్రేక్షకుడిని కదిలించడానికే ఈ సంభాషణలు పుట్టాయి అనేంతలా ఉంటాయి ఒక్కో మాట.
▪”వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలి.”
▪కథ ప్రేమలాంటిది మనకు కావాల్సినపుడు దొరకదు దానికి కావల్సినపుడు వస్తుంది
▪భాషదేముంది దానివెనక భావం అర్ధం చేసుకుంటే చాలు
▪జీవితంలో నటించొచ్చుకాని జీవితాన్ని నటించకూడదు
▪ప్రతిభ ఇంటిపట్టునుంటే ప్రపంచానికి పుట్టగతులుండవు

పెద్దవాళ్ళను గౌరవించాలి, సావిత్రి గారు లాంటి వారిని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలి. ఈ ఒక మాట చాలు ఆమె ప్రాముఖ్యతను చెప్పడానికి. ప్రేక్షకులకు సావిత్రి గారు తిరుగులేని నటి అయితే, అభిమానులకు మాత్రం గుడి లేని దేవత. మామూలుగు మొదలై ఒక ప్రభంజనం సృష్టించి థియేటర్లను ప్రేక్షకులతో నింపేసిన మహానటి సినిమాకి నేటితో ఐదేళ్లు.

#5YearsOfMahanati

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు