Mahesh Babu: నాన్నగారు మన మధ్యే ఉంటారు

తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త సినీ ప్రపంచంలో ఓ తీరని లోటుగా మారింది.
వారి అకాల మరణంతో ఇండియన్ సినిమా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను.

నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు