Mahesh Babu : ఓవర్సీస్ లో మరోసారి

ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో రిలీజ్ అయ్యే చాలా సినిమాలు ఓవర్సీస్ లో విడుదల అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు డిమాండ్ మరీ ఎక్కువ. సాధారణంగా నాన్ ఇంగ్లిష్ సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రావడం చాలా కష్టం. కానీ, ప్రిన్స్ మహేష్ బాబుకు ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్లు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.

ఇటీవల వచ్చిన సర్కారు వారి పాటతో కలిపి మహేష్ ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 11 సార్లు 1 మిలియన్ మార్క్ ను అందుకున్నాడు. టాలీవుడ్ లో ఇదే అత్యధికం. ఇక 2 మిలియన్ల డాలర్ల కలెక్షన్లు తెచ్చిన సినిమాలు 4 ఉన్నాయి. సౌత్ లో ఇలాంటి రికార్డ్ రజినీ కాంత్, ప్రభాస్ కు మినహా ఇంకెవరికీ లేవు. ఇలా మహేష్ బాబు తన సినిమా రిలీజ్ అయిన ప్రతి సారి ఓవర్సీస్ లో సత్తా చూపిస్తున్నాడు.

తాజాగా మరోసారి ఓవర్సీస్ లో తన సత్తా ఏంటో చూపించాడు మహేష్. 2006 లో ప్రిన్స్ మహేష్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమా మళ్లీ రి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 9న పోకిరి సినిమా ఓవర్సీస్ లో రి రిలీజ్ కానుంది. దాని కోసం కాలిఫోర్నియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. గంటలోనే హౌస్ ఫుల్ అయిపోయింది. దీంతో మహేష్ నుంచి వచ్చే కొత్త సినిమాలకే కాదు, 16 ఏళ్ల క్రితం వచ్చే సినిమాలకు కూడా అదే హవా ఉంటుంది అని సూపర్ స్టార్ అభిమానులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు