Malli pelli : నరేష్ – పవిత్రల పెళ్లికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కేవలం నటుడు నరేష్ – పవిత్రల రిలేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని.. మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ – పవిత్రలు కూడా త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించేశారు.

అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవడం కృష్ణ కుటుంబ సభ్యులకు ఇష్టమేనా..? వాళ్ల నిర్ణయం ఏంటి..? అన్న ప్రశ్నలు మాత్రం కొన్ని రోజులుగా చాలా మందిలో అలాగే ఉండిపోయాయి. ఈ ప్రశ్నలకు నరేష్ తాజాగా సమాధానమిచ్చారు. నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రం మే 26వ తేదీన తెలుగు, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ – పవిత్ర పలు ఇంటర్యూలలో పాల్గొంటున్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్యూలో నరేష్ – పవిత్ర కలిసి జీవించడాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారు అనే విషయాన్ని నరేష్ బయట పెట్టారు.
” మా బంధం, మా కుటుంబ సభ్యులకు ఇష్టమే. వాళ్ల అంగీకారంతోనే మేము ముందడుగు వేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అంటే మహేష్ బాబు కూడా వస్తారు. అయితే నిజంగానే వీళ్ళ పెళ్లికి మహేష్ బాబు ఒప్పుకున్నారా అనేది ఇప్పుడు అభిమానులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. వాస్తవానికి మహేష్ బాబు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. మరి నరేష్ నాలుగో పెళ్లికి మహేష్ బాబు ఎలా సపోర్ట్ చేశారు..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే దీని అంతటికీ కారణం పవిత్రనే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. నరేష్ ఎప్పుడు.. ఎక్కడ.. ఏం మాట్లాడాలో..! పవిత్రనే డిసైడ్ చేస్తుందట. తెరపై సైలెంట్ గా కనిపించే పవిత్ర తెర వెనుక మాత్రం నరేష్ ని దగ్గరుండి నడిపిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు