SSMB28: వాయిదా తప్పదు

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు. SSMB28 మొదలైనప్పటి నుండి ఆటంకాలు తప్పడం లేదు. అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ సినిమాలు తరువాత త్రివిక్రమ్ , మహేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాను మొదలుపెట్టినప్పుడే రిలీజెజ్ డేట్ ను అనౌన్స్ చేసేసారు మూవీ టీం.

ఎట్టకేలకు భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి, వరుస బ్రేకులు పడ్డాయి. కొన్ని రోజులు క్రితం వరకు, మహేష్ కథపై అసంతృప్తితో ఉన్నారని, కథలో మార్పులు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి. కానీ వాటిలో వాస్తవాలు తెలియవు. కానీ అందరికి తెలిసిన బాధాకరమైన విషయాలు ఏంటంటే ఘట్టమనేని ఇంట వరుస విషాద ఛాయలు అలుముకోవడం.

ఇలాంటి తరుణంలో మహేష్ మానసికంగా కోలుకోవడానికి కొంత టైం కావాలి. చిత్ర యూనిట్ కూడా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంతవరకు వేచి చూడక తప్పదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడక తప్పదు. లేదు చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యాలి అని ఫిక్స్ అయితే అజ్ఞాతవాసి లాంటి ఫలితం మళ్ళీ చూడక తప్పదు. ఏదేమైనా ఇప్పుడు చెప్పిన టైమ్ కు ఏ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్, కార్తికేయ లాంటి సినిమాలు కూడా రిలీజ్ విషయంలో డేట్స్ మారుతూ వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు బట్టి SSMB28 కూడా వాయిదా తప్పదు అని స్పష్టమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు