Trivikram: మహేష్ – త్రివిక్రమ్ మూవీ అదిరిపోయే అప్డేట్

ఇండస్ట్రీ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాలు కూడా మహేష్ కెరియర్ పెద్ద ప్లస్ అయ్యాయి. అప్పట్లో ఖలేజా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా ,ఇప్పటికి ఖలేజా సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతారు.

“దైవో మనుష్య రూపేణా” అనే సంస్కృతం లోని ఒక లైన్ తీసుకుని కథను అల్లిన త్రివిక్రమ్ ఇంటెన్సెన్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు.
ఒక సినిమా థియేటర్స్ లో ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి,
రిలీజ్ అయినా టైం,
ఆ టైం లో సొసైటీ లో జరుగుతున్న పరిణామాలు
ఆ సినిమాకు పోటీగా ఉన్న సినిమాలు ఇలా మరెన్నో
ఖలేజా సినిమాలో సీతారామ రాజు అనే టాక్సీ డ్రైవర్ ను దేవుడు అంటే ప్రేక్షకులు తీసుకోలేకపోయారు.

కృష్ణుడు అనేవాడు మహా భారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పాటు రాజ్యం పరిపాలించాడు.
ఆయన ఒక మాములు మనిషిగా చనిపోయాడు
ఆయన చనిపోయిన తరువాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్లిపోయారు
ఆయన కొడుకులను చంపేశారు
ఆయన భార్యలను దోచుకెళ్లిపోయారు
సత్యభామ విధవ రాలిగా తపోభూమికి వెళ్ళిపోయింది
రుక్మణి సతీసహగమనం చేసింది
ఈ విషయాలు ఏవి మనకు తెలియవు
ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్
మనకు భగవత్గీత చెప్పిన కృష్ణుడు మాత్రమే మనకు కావాలి
ఎందుకంటే ఆయన అప్పుడు మాత్రమే మనకు దేవుడు.
అలానే సీతారామరాజు అనే టాక్సీ డ్రైవర్ పాళీ అనే ఊరిలో ఆ జనాలను కాపాడినప్పుడు మాత్రమే దేవుడు, ఆ తరువాత ఆయన జస్ట్ ఒక టాక్సీ డ్రైవర్.

- Advertisement -

అని చెప్తూ త్రివిక్రమ్ ఖలేజా సినిమా గురించి ఇచ్చిన ఎక్సప్లనేషన్ వింటే ఇంత గొప్ప సినిమాను హిట్ చేయకుండా వదిలేశామా అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎట్టకేలకు ఈ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తుందంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా ఉండబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు