Majili Child Actor: చైతూ ప్రేయసి కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా..?

Majili Child Actor: కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ఒకటి రెండు సినిమాలలో నటించినా.. తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. అలాంటి వారిలో మజిలీ సినిమా చైల్డ్ యాక్టర్ కూడా ఒకరు.. తన ముద్దు ముద్దు మాటలతో.. బొద్దుగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఈ అమ్మాయి.. ముఖ్యంగా నాగచైతన్య ను, సమంత ను కలిపే సన్నివేశాలలో చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ఇకపోతే మజిలీ సినిమా 2019లో వచ్చి క్లాసికల్ హిట్గా నిలిచింది. కేవలం రూ .20 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది..

నాగచైతన్య – సమంత కాంబోలో సూపర్ హిట్ మూవీ..

నాగచైతన్య – సమంత కాంబినేషన్లో ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలు తెరకెక్కగా.. అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. ముఖ్యంగా మజిలీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరి కెరియర్ లో టాప్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలుగా ఇవి నిలిచిపోయాయి.. ఇకపోతే మజిలీ సినిమాలో ప్రియతమా ప్రియతమా, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు అనే పాటలు మాత్రం ఎవర్గ్రీన్.. ఎప్పటికీ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటూనే వుంటాయి. ఇందులో నాగచైతన్య విరహ ప్రేమికుడిగా కనిపించగా..భర్త కోసం పరితపించి పోయే శ్రావణి పాత్రలో ఈమె జీవించిందని చెప్పవచ్చు..

హీరోయిన్ ను తలపిస్తున్న చైతూ ప్రేయసి కూతురు..

Majili Child Actor: Have you seen how Chaitu's girlfriend's daughter is now?
Majili Child Actor: Have you seen how Chaitu’s girlfriend’s daughter is now?

ఇకపోతే ఈ సినిమాలో మీరా క్యారెక్టర్ కీ రోల్ అనే చెప్పాలి.. మీరా వచ్చాక సినిమా మొత్తం యు టర్న్ తీసుకుంటుంది..మీరా పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ గా మారుతుంది.. ఇప్పుడు ఏమని చూసిన నెటిజన్స్ హీరోయిన్ పీస్ అంటూ అప్పుడే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ అమ్మాయి పేరు అనన్య అగర్వాల్.. 2004 ముంబైలో పుట్టిన ఈమెకి ప్రస్తుతం 20 ఏళ్లు వచ్చేసాయి.

- Advertisement -

అనన్య అగర్వాల్ నటించిన సీరియల్స్..

తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా తో టీవీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన అనన్య అగర్వాల్.. అక్కడ పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది.. ముఖ్యంగా ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? క్యా హువా తేరా వాదా, సియా కే రామ్, మహాభారత్ వంటి సీరియల్స్ లో నటించిన ఈమె.. ఇవే కాకుండా పలు యాడ్స్ లో కూడా మెరిసింది ఈ చిన్నారి.

వెండితెరపై మజిలీకే పరిమితం..

ఇక సిల్వర్ స్క్రీన్ విషయానికి వస్తే.. ఈమె మజిలీ సినిమాలో మాత్రమే నటించింది.. ఈ సినిమాలో చైతన్య మాజీ ప్రేయసి కుమార్తెగా చాలా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.. ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఏజ్ కారణంగా పూర్తి స్థాయిలో హీరోయిన్ అయ్యే అవకాశాలు ఈమెకు లభించలేదు.. బుల్లితెర పైనే నటనను కంటిన్యూ చేసిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. పలు రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తోంది.. త్వరలోనే వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఏది ఏమైనా చైతూ మాజీ ప్రేయసి కూతురు ఇప్పుడు అందరిని ఆకట్టుకోవడమే కాదు తన అందచందాలతో ఆశ్చర్యపరుస్తోంది కూడా. ఇక త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు