Malaika Arora : YES చెప్పింది హాట్ స్టార్ కే

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా పరిచయం అక్కర్లేని పేరు. 1997 నుంచే బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తర్వాత హీరోయిన్ గా, టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఈమె తొలుత 1998 లో నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన అర్పాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. 2017 లో ఈ జంట విడాకులతో విడిపోయారు. అప్పటికే వీరికి 15 ఏళ్ల అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు.

విడాకుల తర్వాత మలైకా అరోరా మరో బాలీవుడ్ హీరోతో ప్రేమయాణాన్ని సాగించింది. 49 ఏళ్ల ఈ బాలీవుడ్ భామ 37 ఏళ్ల అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తోంది. వీరి బంధం 2016 నుంచే ప్రారంభమైందని ఒక టాక్ కూడా ఉంది. మలైకా, అర్జున్ సమయం దొరికిన ప్రతిసారి షికార్లకు తిరుగుతున్నారు. దీంతో మీడియా కంట కూడా ఎక్కువ సార్లు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా..  తాజాగా మలైకా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.

ఈ పోస్టులో I SAID YES తో పాటు మూడు లవ్ సింబల్స్ ఉన్నాయి. దీంతో అర్జున్ కపూర్ మలైక కు పెళ్లి ప్రపోజ్ చేశారని, అందుకు మలైక అంగీకరించిందని, అందుకే మలైక ఈ పోస్ట్ పెట్టిందని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ వార్తలపై మలైకా స్పందించింది. తాను YES చెప్పింది హాట్ స్టార్ లో రాబోయే ఒక షో కు అని చెప్పింది. ఆ షోలో తాను జడ్జిగా వ్యవహరించబోతున్నట్టు తెలిపింది. దీంతో 12 ఏళ్ల వ్యత్యాసం ఉన్న మలైక, అర్జున్ ప్రేమ జంట పెళ్లి వరకు ఇంకా రాలేదని, దానికి ఇంకా టైమ్ ఉందని స్పష్టమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు