Manchu Lakshmi : నా జీవితంలో ఆ తప్పులు చేశా

ఏజ్ పెరుగుతున్న కొద్దీ మంచు లక్ష్మి లో మాత్రం జోష్ పెరుగుతోంది. మునుపటి కంటే ఎక్కువ స్పీడుతో దూసుకుపోతోంది మోహన్ బాబు కూతురు. అటు వెండితెరతో పాటు, ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది. మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటుంది ఈ మంచు వారి ఆడపడచు. మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది.

ఇప్పటికే చాలా షోస్ కు యాంకర్ గా అదరగొట్టిన మంచు లక్ష్మి, రీసెంట్ గా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆహలో కుకింగ్ షో తో మరోసారి మన ముందుకు వచ్చింది. గతంలో ఆహా భోజనంబు అంటూ, ఫస్ట్ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన మంచు లక్ష్మి, సెకండ్ సీజన్ లో చెఫ్ మంత్రతో ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా మంచు లక్ష్మి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది.

ఆమె ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో “గతంలో నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. ఇప్పుడు నేను మారాను. ఇకపై ఆ తప్పులు చేయాలి అనుకోవడం లేదు” అంటూ కామెంట్ చేశారు. ఇది పలు అనుమానాలకు దారితీస్తుంది. మంచు లక్ష్మి చేసిన అతి పెద్ద తప్పులు ఏమిటని సోషల్ మీడియా జనాలు చర్చకు దిగారు. ఆమె చెబుతున్న తప్పులు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవా? లేక వృత్తిపరమైనవా? అనే సందిగ్ధంలో పడ్డారు. మంచు లక్ష్మి కెరీర్ గురించి అందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని తెలియని కోణాలు ఉన్నాయి. ఏది ఏమైనా మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు కారణమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు