Aham Bramhasmi: ఈ మంచు కుర్రాడి సినిమా రాదా?

మంచు మనోజ్.. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కొడుకుగా 2004 లో దొంగ దొంగది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ బాబు స్టైల్ లో కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరు సంపాదించాడు మంచి మనోజ్. బిందాస్, పోటుగాడు లాంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టిన మనోజ్.. ప్రయాణం, వేదం,, mr నూకయ్య లాంటి ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీ లో ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఇక మంచు వారి ఫ్యామిలీలో వివాదాల జోలికి పోకుండా ఉండే ఏకైక వ్యక్తి మంచు మనోజ్.

టాలీవుడ్ లో అందరూ వరుస సినిమాలు చేస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ,మూవీస్ చేస్తుంటే మనోజ్ మాత్రం లాక్డౌన్ ఇప్పటివరకు కనిపించలేదు. ఇక మనోజ్ చివరగా 2017లో “ఒక్కడు మిగిలాడు” మూవీ లో హీరోగా నటించాడు. ఆ తర్వాత మళ్ళి సినిమాలు చేయలేదు. ఓ రెండు సీన్లలో గెస్ట్ అప్పీరెన్స్ మాత్రమే ఇచ్చిన మనోజ్ ఆ మధ్య స్వీయ నిర్మాణంలో “అహం బ్రహ్మాస్మి” అనే సినిమా రామ్ చరణ్ అతిథిగా గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరుపుకుంది. అయితే కారణమేంటో తెలీదు గాని లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమా మళ్లీ షూటింగ్ జరుపుకోలేదు. ఇక ఈ మధ్యే భూమా మౌనిక ను వివాహం కూడా చేసుకున్న మనోజ్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం తన ఆగిపోయిన సినిమా తప్ప మరే సినిమా కూడా ఇప్పటికి అనౌన్స్ చేయలేదు. మరి మంచు మనోజ్ సినిమాలు ఇప్పట్లో వచ్చేలా మాత్రం కనబడట్లేదు. మంచు మనోజ్ కి సరైన హిట్లు లేకపోయినా మంచి ప్రయోగాత్మక సినిమాలతో అభిరుచి గల హీరోగా పేరుతెచ్చుకోవడం వల్ల టాలీవుడ్ లో తన సినిమాల గురించి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఇది గమనించి మనోజ్ ఇప్పటికైనా సినిమాలు చేస్తాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు