Manchu Vishnu : ఒకే రోజు అక్కా, త‌మ్ముడు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు సినిమా వ‌చ్చి చాలా కాల‌మే అయింది. స‌మ‌యం తీసుకొని ఈసారి ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో జిన్నా సినిమా చేశాడు. సొంత బ్యాన‌ర్‌లోనే ఆయ‌న స్వ‌యంగా నిర్మించిన ఈ సినిమాకి సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జిన్నా టైటిల్ జ‌నంలోకి బాగానే వెళ్లింద‌నే చెప్పాలి. ఈ చిత్రంలో విష్ణు మాస్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు.

ఇందులో పాల్‌, స‌న్నిలియోన్ ఇద్ద‌రూ అందాలు ఆరబోయ‌డంలో ఎలాంటి మొహ‌మాటాలు లేనివారు ఉండ‌డం ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఈ చిత్రానికి దూసుకెళ్తా చిత్ర ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డి క‌థ అంద‌జేశారు.కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాను ప‌ట్టుగా న‌డిపిస్తుంద‌ట‌. తొలుత జిన్నా సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్ సినిమాలు ఉండ‌డంతో దీపావ‌ళికి వాయిదా వేశారు.

ఈసారి దీపావ‌ళి పండుగ‌కి తొలుత ‘బ్లాక్ ఆడ‌మ్‌’ సినిమా అక్టోబ‌ర్ 20న విడుద‌ల‌వుతోంది. అక్టోబ‌ర్ 21న ఓరిదేవుడా, ప్రిన్స్‌, స‌ర్దార్‌, జిన్నా సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అదేవిధంగా అక్టోబ‌ర్ 25న రామ‌సేత్ సినిమా కూడా విడుద‌ల‌వుతోంది. మ‌రోవైపు మోహ‌న్ లాల్ న‌టించిన మాన్ స్టార్ చిత్రం కూడా అక్టోబ‌ర్ 21న విడుద‌ల‌వుతుండ‌డం విశేషం. మ‌రోవైపు మంచు విష్ణు ‘జిన్నా’ ఈ నెల 21న మలయాళంలో కూడా విడుదల కాబోతోంది. అదే రోజున మోహన్ లాల్ నటించిన ‘మాన్ స్టర్’ కూడా రిలీజ్ అవుతోంది. మ‌రో విశేషం ఏమంటే ఈ మూవీతో మంచు లక్ష్మి మల్లూవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మ‌ల‌యాళంలో అక్కా, త‌మ్ముడు సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌వ్వ‌డం విశేషం. ఎవ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో తెలియాలంటే అక్టోబ‌ర్ 21న వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు