RRR : దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం దేశంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్నారు జ‌క్క‌న్న. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వ‌స్తుంద‌ని తెగ ప్రచారం జరిగింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేట్ కాక‌పోవ‌డంతో అభిమానులతో పాటు సినీ న‌టులు సైతం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ది క‌శ్మిర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ ని వెన‌క్కి నెట్టి గుజరాతి ఫిల్మ్ ఛెల్లో షో ఎంపికైంది. ఈ విష‌యంలో ఆర్ఆర్ఆర్‌కి మ‌ద్ద‌తు కోసం చిత్రం క్యాంపెయిన్ ప్రారంభించింది. 15 విభాగాల్లో ఆస్కార్ నామినేష‌న్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వ‌హిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.

ఆస్కార్‌లో బెస్ట్ క్రింగ్ మూవీ అనే కేట‌గిరి ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ క‌చ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుంద‌ని ఓ నెటిజ‌న్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అందుకు మంచు విష్ణు బ‌దులిస్తూ.. భార‌తీయ సినిమాగా మ‌నం ఎందుకు జ‌రుపుకోకూడ‌దు సోద‌రా..? ఇది కేవ‌లం ప్రాంతీయ చిత్రానికి ద‌క్కే గౌర‌వం కాదు. జాతీయంగా దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అంటూ పోస్ట్ చేశారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా 1200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. హాలీవుడ్ ప్రేక్ష‌కులు సైతం ఈ సినిమా ఆస్కార్ బ‌రిలో నిల‌వాల‌నుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేస్తూ ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా గుజ‌రాతీ సినిమా అయినటువంటి చెల్లో షోను ఆస్కార్‌కి నామినేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు