Mass Mogudu : ఊరమాస్ లిరిక్స్ తో..

నందమూరి బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. క్రాక్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న వీరసింహారెడ్డి.. సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈనెల 12న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. దీనికోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన అన్ని అప్డేట్స్ నందమూరి అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచాయి. జై బాలయ్య, సుగాన సుందరి, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ సాంగ్ ఆధ్యాంతం ఊరమాస్ లిరిక్స్ తో దూసుకుపోగా, ఈ పాటను మనో, రమ్య బెహరా కలిసి పాడారు. ఇక ఈ పాటలో శృతిహాసన్ తో కలిసి బాలయ్య ఊరమాస్ రొమాన్స్ తో పాటు అదిరేపోయే స్టెప్పులు కూడా వేస్తున్నట్లు ఈ లిరికల్ వీడియో సాంగ్ లో చూపెట్టారు. మొత్తానికి వీరసింహారెడ్డి సినిమాలోని అన్ని పాటలు కూడా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ డైలాగులు ఉపేక్షకులను విజిల్స్ వేసేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు