Meera Jasmine: ఆ సినిమా తో తెలుగు లోకి రీఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై సాంప్రదాయబద్ధమైన పాత్రలు పోషించి, క్యూట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ”అమ్మాయి బాగుంది” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, మాస్ మహారాజా రవితేజతో భద్రా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ల సరసన చేరింది.

హీరోయిన్ గా తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా.. తనదైన ముద్ర వేసుకుంది. నటన, గ్లామర్ తోను ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది మీరా జాస్మిన్. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్ని సినిమాలను ఒప్పేసుకుంది. ఈ క్రమంలోనే అన్ని పరాజయాలు కావడంతో క్రమంగా ఛాన్స్ లు తగ్గిపోయాయి.

అదే సమయంలో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాస్ ని తిరువనంతపురంలోని పాలయంకోటైలో గల ఎల్ఎంఎస్ చర్చిలో 2014 ఫిబ్రవరి 12న వివాహం చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను తగ్గించేసిన మీరాజాస్మిన్ ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ గ్లామర్ షో చేసి సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయింది. అలా దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

విమానం అనే తెలుగు, తమిళ బైలింగ్యువల్ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో మీరాజాస్మిన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. జి స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు