Chiranjeevi Birthday : మెగా కార్నివాల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. తన స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి, ఎన్నో కష్ట నష్టాలను అనుభవించిన తరువాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మెగా అభిమానులు చిరు పుట్టిన రోజు కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా బర్త్ డే వేడుకలకు మెగాస్టార్ దూరంగా ఉన్నారు. అయితే ఈ సారి కరోనా ప్రభావం ఎక్కువ లేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా చేయాలని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ సారి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని స్వయంగా నాగబాబు వెల్లడించారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు ప్రతి ఒక్క చిరు అభిమానులు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.

ప్రతి సంవత్సరం అన్నయ్య బెర్త్ డే వేడుకలను శిల్పకళా వేదికలో చేసేవాళ్ళమని అన్నారు. అయితే ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ ను హైటెక్స్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇండియాలో ఏ సినిమా హీరోకు కూడా కార్నివాల్ లాంటిది పెట్టలేదని చెప్పారు. ఈ కార్నివాల్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంటానని నాగబాబు తెలిపారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలు అందరూ పాల్గొంటారని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు