Mega Star: తండ్రిని కోల్పోయాను..

మెగా స్టార్ చిరంజీవి, కళాతపస్వి విశ్వనాథ మధ్య సంబంధం గురంచి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వీరిది తండ్రి కొడుకుల సంబంధం అని ఎప్పుడూ చెప్తుంటారు చిరంజీవి. అవకాశం వచినప్పుడల్లా విశ్వనాథ్ రుణం తీర్చుకోలేనిది అని అంటూ ఉంటారు. “గ్యాంగ్ లీడర్” సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవిని “స్వయంకృషి” తో అమాయకత్వం, చిలిపి మెగా స్టార్ ను పరిచయం చేసారు విశ్వనాథ్. ఈ అగ్ర దర్శకునితో “స్వయంకృషి”, “శుభలేఖ”, “ఆపద్భాందవుడు ” సినిమాలో నటించారు చిరంజీవి. వీరి మరణం ఒక చిరంజీవికే కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు ఎనలేని లోటును తెచ్చింది. ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.

ఈ సందర్బంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్ ను చేసారు “ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి.

43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.” అని చెప్పుకొచ్చారు చిరు.

- Advertisement -

ఈ ట్వీట్ తో చిరుకి విశ్వనాథ్ పై అంత ప్రేమ ఉందొ చెప్పవొచ్చు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు