Mega Star : రీమేక్ లకే ప్రాధాన్యత

లేటెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కంబినేషన్ లో రిలీజ్ అయిన సినిమా ”వాల్తేరు వీరయ్య”. ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన 5 రోజుల్లోనే, 150కోట్ల కలెక్షన్లు సంపాదించుకుంది. అలాగే యూఎస్ లో 2 మిలియన్ మార్క్ ను కూడా అతి తక్కువ సమయంలోనే చేరుకుంది. ఈ సినిమాతో చిరంజీవి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. మెగా స్టార్ హవా ఇక పై ఇదే తరహాలో కొనసాగితే యంగ్ హీరోలకి కూడా గట్టి పోటీ ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

అయితే మెగాస్టార్ కొత్త స్టోరీలు కాకుండా, రీమేక్ స్టోరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. మొదట్లో రీమేక్ సినిమాలకి కొంచం దూరంగా ఉండే మెగా స్టార్ కంబ్యాక్ తర్వాత వాటి పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. విజయ్ తలపతి నటించిన కత్తి సినిమా ను తెలుగులో ఖైదీ నెంబర్ 150 పేరు రీమేక్ చేసి సిల్వర్ స్క్రీన్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కమ్ బ్యాక్ తర్వాత చిరు ఇప్పటి వరకు 6 సినిమాలకు సైన్ చేశాడు. అందులో మూడు సినిమాలు రీమేక్ వే. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన “గాడ్ ఫాదర్” మంచి కలెక్షన్స్ తెచుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయంగా నిలవలేకపోయింది. వీటితో పాటు ప్రస్తుతం తమిళంలో వచ్చిన వేదళం సినిమాను తెలుగులో భాళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -

ఒక రీమేక్ సినిమా సెట్స్ పై ఉన్నప్పడే మరో రీమేక్ కు మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన “విశ్వాసం” అనే సినిమాని రీమేక్ చేయడానికి చిరు సన్నాహాకాలు చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ ను ఖైదీ నెంబర్ 150ని తెరకెక్కించిన వీవీ వినాయక్ చేతిలో పెట్టినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే.. భోళా శంకర్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు