Mega154-NBK107 : ఒకే సెట్ లో..

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నారు. ఇంటర్వెల్ లో చిరంజీవి పోలీస్ అని అందరికీ తెలుస్తోందని సమాచారం. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 107 ఓ సినిమా చేస్తున్నారు.నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. ఈ చిత్రానికి ఇటీవల ” వీర సింహారెడ్డి” అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.

అయితే విశేషమేమిటంటే.. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో పక్క పక్కనే చిరంజీవి, బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న రవితేజ పై ప్రస్తుతం పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకృష్ణ వీర సింహారెడ్డి షూటింగ్ కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

- Advertisement -

సచిన్ ఖేడేకర్ పై కర్నూలు రిజిస్టార్ కార్యాలయం సెట్ లో కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పక్కపక్కనే షూటింగ్ లు జరుపుకోవడంతో షూటింగ్ ప్రదేశాన్ని చూసేందుకు జనాలు సైతం ఎగబడుతున్నారు. నేడు దీపావళి పండుగ సందర్భంగా సోమవారం షూటింగ్ కి విరామం ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు