Megafans: అభిమానులకు అభినందనలను తెలియచేసిన చిరు.. ఎందుకో తెలుసా?

మెగా స్టార్ చిరంజీవి.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయిన చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా ప్రజా సేవలోను ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. 20ఏళ్లకిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలనందిస్తూ వచ్చిన చిరంజీవి ఇప్పటికీ పలు ఆర్టిస్టులకు సాయం చేయడం గమనిస్తూనే ఉన్నాం. రీసెంట్ గా బలగం ఫేమ్ మొగులయ్యకు ఆపరేషన్ కోసం రెండులక్షల సాయం అందించిన మెగాస్టార్, తమిళ నటుడు పొన్నాంబళం కోసం దాదాపు 50 లక్షలు ఖర్చు చేసారు. ఇక ఆయన స్థాపించిన “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్” ద్వారా అభిమానులు కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

ఇక మెగాభిమానులు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మనం గమనిస్తూనే ఉన్నాం. అప్పట్లో హుద్హుద్ తుఫాన్ సమయంలో అభిమానుల తరపున 50లక్షల రూపాయల సాయం అందించడమే గాకుండా ప్రజలకి సాయం కూడా అందించారు. ఇక రీసెంట్ గా అలాంటి మంచి పనే ఇప్పుడు మళ్ళీ చేశారు. ఇటీవల ఒరిస్సాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది మృత్యువాత పడగా, ఎన్నో వందల మంది తీవ్రంగా గాయాల పాలయ్యారన్నసంగతి తెలిసిందే. అక్కడ గాయపడ్డ వారికీ మెగాఫ్యాన్స్ తమ వంతుగా ముందుకొచ్చి చాలా మందికి ఆర్థికంగా ఆదుకోవడమే గాక దాదాపు కొన్ని వందల మంది మెగాభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి రక్తదానం చేసారు.

ఈ విషయాన్నీ అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులకు విషెస్ తెలియచేసారు. ఇలాంటి పనులు మరిన్ని చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు