Tollywood: మెగాస్టార్ చిరుకి కూడా ఒకప్పుడు కాన్సర్ అని తెలుసా!

టాలీవుడ్ ని మూడు దశాబ్దాల పాటు ఏలిన మెగా మహారాజు మెగాస్టార్ చిరంజీవి. నటనా ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చుసిన చిరంజీవి సినిమాల్లోనే గాక నిజ జీవితంలోను మంచి వ్యక్తిగా అభిమానులతో పాటు తెలుగురాష్ట్రాల ప్రజలకు ఎంతో సేవ చేశారు చిరంజీవి. 20ఏళ్ళ కిందంటే చిరంజీవి ప్రజలకు సేవ చేయాలనీ మదర్ థెరిస్సా ఆదర్శంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ల ద్వారా ప్రజలకు సేవలనందిస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా రక్తాన్ని ఇచ్చారు మెగాభిమానులు. ఇక చిరు స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి టాలీవుడ్ ప్రముఖులు ప్రజలకు సేవలందిస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో చిరు ఆరోగ్యం గురించి ఒక వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆ విషయం పై మెగా అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అసలు విషయానికి వస్తే ఈరోజు అనగా జూన్ 3న హైదరాబాద్ లోని నానాక్ రామ్ గూడలో ఒక “స్టార్ క్యాన్సర్ సెంటర్” ని లాంచ్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లడం జరిగింది. ఆ ఈవెంట్ లో చిరంజీవి తన ఆరోగ్యం గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ని ఈరోజు పబ్లిక్ తో షేర్ చేసారు. అక్కడ చిరు మాట్లాడుతూ హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ కి తనని పిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చిరు అన్నారు.అయితే ఒకప్పుడు తనని కూడా ఈ క్యాన్సర్ మహమ్మారి పట్టుకుందని అన్నారు. క్యాన్సర్ జబ్బులలో ఒకటైన మోనోక్లోనిక్ తనకి కూడా వచ్చిందని, మొదట్లోనే గమనించడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని జయించానని అన్నారు.

అయితే ఈ విషయం అందరికి చిరు ద్వారా ఇప్పుడే తెలియడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డా, చిరంజీవి క్యాన్సర్ ని జయించానని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ఇలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి ఇప్పటికే భోళా శంకర్ షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేయగా కొత్త సినిమా చర్చల్లో ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు