Mehreen: ఆమెకు ఏమైందంటే?

నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అందాల తార మెహరీన్ కౌర్ ఫిర్జాదా. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. లుక్స్ పరంగా, నటన పరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మహానుభావుడు, ఎఫ్ 2, రాజా ది గ్రేట్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత తెలుగుతోపాటు, తమిళ, పంజాబీ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే ఇటీవల వరుస ప్లాప్ లు పలకరించాయి. అయితే ఇటీవల f3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మెహరీన్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. తన అందాన్ని పెంచుకోవడానికి మెహరీన్ “అక్యూస్కిన్ లప్ట్” థెరపీ చేయించుకుంది. ముఖం నిండా సుదులతో గుచ్చి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చైనీస్ శాస్త్రీయ వైద్య పద్ధతి అయిన ఆక్యుపంక్చర్ ను ఎంచుకుంది. “ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు” అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మరింత కాంతివంతంగా దుబాయ్ లేదా లండన్ లో కలుద్దాం అని పేర్కొంది మెహరీన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు