Miss Shetty, Mr. Polishetty: ఉగాది సందర్భంగా బిగ్ అప్డేట్

లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పోలిశెట్టి, జాతి రత్నాలు సినిమా తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. సూపర్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క శెట్టి అరుంధతి సినిమా తో స్టార్ హీరోయిన్ గా నిలిచి ఇండస్ట్రీ ని రాణించింది. 2020 లో నిశ్శబ్దం సినిమా తరువాత ఈ భామ ఏ సినిమాలో కనిపించలేదు.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్ళీ తెర మీదకు రానున్నారు. ఈ కామెడీ డ్రామా సినిమాకు ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో అయితే లండన్ లో ఉండే అనుష్క, హైదరాబాద్ లో ఉండే నవీన్ పోలిశెట్టి మద్య ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా చిత్రికరించబడిందని తెలుస్తుంది. దీనితో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా గురించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని విడుదల చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారని మేకర్స్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. UV క్రియేషన్స్ వారిచే నిర్మించబడిన ఈ సినిమా సమ్మర్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కనుంది అని కంఫర్మ్ చేసారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు