F3 : డబ్బే ఆధారం..

డబ్బు..
జీవితం ప్రశాంతంగా సాగాలంటే డబ్బు..
ప్రతి ఒక్కరి లైఫ్ డబ్బు చుట్టూనే తిరుగుతుంది..
డబ్బు ఉన్నడికి ఫన్. లేనోడికి ఫ్రస్టేషన్..
అలాంటి డబ్బుకు ఎలాంటి వారైనా, మొదటి ఫ్రాధాన్యత ఇస్తారు. రియల్ లైఫ్ లోనే కాదు, రీల్ లైఫ్ లోనూ ప్రస్తుతం ఇదే నడుస్తుంది. డైరెక్టర్లు డబ్బు ఆధారంగానే స్టోరీలను సిద్ధం చేసుకుంటున్నారు. మనీతో పలువరు డైరెక్టర్లు ఫన్ క్రియేట్ చేస్తే, మరి కొందరు సీరియస్ స్టోరీలుగా మార్చుతున్నారు.

గురువారం రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట స్టోరీ పూర్తిగా డబ్బు నేపథ్యంలోనే ఉంటుంది. బ్యాకింగ్, లోన్స్ చుట్టూ సాగుతుంది. పది వేల డాలర్లు, పది వేల కోట్ల లోన్ అంటూ విలన్, హీరో మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. లోన్స్ ఎగవేతపై డైరెక్టర్ పరశురామ్ ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకులకు చేరుతుంది.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా ఎఫ్ 3 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా మనీ నేపథ్యంలోనే ఉంటుందని ఇటీవల రిలీజైన ట్రైలర్ తో తెలుస్తుంది. ” పంచ భూతాలు ఐదే అనుకుంటారు.. కానీ ఎవరికీ కనిపించని మరో భూతం ఉంది అదే డబ్బు “ అంటూ స్టార్ట్ అయ్యే డైలాగ్ తో పాటు ’’ ల్యాబ్ దబ్ ల్యాబ్ డబ్ డబ్బూ..’’ సాంగ్ వరకు ఎఫ్ 3 మూవీ డబ్బు చుట్టూనే తిరుగుతుందని అర్థం అవుతుంది.

- Advertisement -

డబ్బు నేపథ్యంలో స్టోరీలు సామాన్య ప్రజల నుండి అన్ని వర్గాల ప్రేక్షకులకు సులువుగా చేరుతుంది. అందుకే డబ్బును ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇదే తరహా స్టోరీతో వస్తున్న ఎఫ్ 3కి కూడా భారీ విజయం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు