August : ఇక సందడే సందడి

టాలీవుడ్ లో హిట్ సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుంది. జూన్ మొదటి వారంలో అడివి శేష్ హీరోగా వచ్చిన మేజర్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా రాలేదు. అదే జూన్ లో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికీ, విరాట పర్వం లాంటి మంచి సినిమాలు వచ్చాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయం సాధించడంలో విఫలం అయ్యాయి. ఇక జూలై గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎందుకంటే, జూలై 1న వచ్చిన పక్కా కమర్షయల్ నుంచి జూలై 29న వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ వరకు అన్ని ప్రేక్షకులను దారుణంగా నిరాశపర్చాయి.

దీంతో ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమా జూలైలో రాలేదు. కనీసం ఆగస్టులో అయినా, వస్తుందా అని చూస్తున్నారు. ఈ ఆగస్టులో ముఖ్యంగా 6 సినిమాలు విడుదల కానున్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సారి చాలా నమ్మకంతో ‘బింబిసార’ అనే సినిమాతో వస్తున్నాడు. కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా 5న విడుదల కానుంది.

- Advertisement -

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి తర్వాత సీతారామం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. విభిన్నమైన లవ్ స్టోరీతో సీతారామం రానుంది. దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా 5న విడుదల అవుతుంది.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూడా ఆగస్టు బరిలోనే ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. డబ్బింగ్ సినిమా అయినా, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగర్జున చేస్తున్న ప్రమోషన్స్ వల్ల ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇది 11న రిలీజ్ కాబోతుంది.

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2 ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడుతూ, చివరికి ఆగస్టులో రిలీజ్ కు సిద్ధమైంది. మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీన్ని కూడా ప్రేక్షకులు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు.ఈ సినిమా 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరో యంగ్ హీరో నితిన్ వరుస ప్లాప్ ల తర్వాత భారీ అంచనాలతో వస్తుంది మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఫుల్ యాక్షన్, కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కూడా హిట్ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇది కూడా 12నే విడుదల కాబోతుంది.

చివరిగా చెప్పుకోదగ్గ సినిమా లైగర్. విజయ్ దేవరకొండ-పూరీ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ దాదాపుగా రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది. దీంతో ఈ సినిమా రికార్డులు నమోదు చేయడం ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమా 25న విడుదల కానుంది.

మొత్తంగా టాలీవుడ్ కు హిట్ లేని లోటును ఆగస్టు నెల తీర్చడం దాదాపు ఖాయం. ఈ ఆగస్టులో వచ్చే ఈ ఆరు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీంతో ఈ నెల మొత్తం థియేటర్స్ వద్ద సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు