Devara : ఎన్టీఆర్ ని కనీసం లెక్క చేయని ఆ టాలీవుడ్ హీరోయిన్

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ లంత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. యంగ్ హీరోల పక్కన, ఎన్ని సినిమాల్లో నటించిన వాళ్ళు టార్గెట్ మాత్రం పెద్ద హీరోల సినిమాలే అయ్యుంటాయి. ఎందుకంటే చిన్న సినిమాలు ఎన్ని చేసిన రాని గుర్తింపు, డబ్బు ఒక్క పెద్ద హీరో సినిమా పడితే వస్తుంది. ఇక అది హిట్టయితే మళ్ళీ అవకాశాల కోసం ఎవర్ని అడగాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ ధోరణి దాదాపు అందరి హీరోయిన్స్ లో ఉంటుంది కానీ ఇటీవలనే టాలీవుడ్ పరిచమైన ఒక యంగ్ హీరోయిన్ లో మాత్రం ఈ రకమైన ఆలోచన లేదనిపిస్తోంది. తెలుగులో ఈ అమ్మడు చేసింది ఒక సినిమానే అయిన ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తే, నిర్మొహమాటం లేకుండా చేయను అని చెప్పిందంట.

అయితే ఆ బ్యూటీ ఎవరో కాదు సీతారామం సినిమాతో టాలీవుడ్ కి పరిచమైన మృణాల్ ఠాకూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సెకండ్ లీడ్ హీరోయిన్ పాత్ర కోసం కొరటాల శివ, మృణాల్ ఠాకూర్ ని కలిసారట. కథ మొత్తం విన్న మృణాల్ వెంటనే చేయను అని చెప్పేసిందట. దాంతో షాక్ అయిన కొరటాల శివ సరే అని చెప్పి వెనుదిరిగాడంట,

- Advertisement -

అయితే ఈ రకంగా నో చెప్పడంతో సినిమాపై మరియు మృణాల్ పై నెగిటివిటీ మొదలైంది. కథ నిజంగానే బాగాలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మృణాల్ తెలుగులో నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో నటిస్తుంది. అలాగే రెండు, మూడు బాలీవుడ్ చిత్రాలతో బిజీ గా ఉంది. మరీ ఇలా వేరే సినిమాలు చేతుల ఉండటం వల్లనో, లేక నిజంగానే తన క్యారెక్టర్ బాగుండకపోవటం మూలనో తెలీదు కానీ మొత్తానికైతే ఎన్టీఆర్ సినిమానే ఈ బ్యూటీ లెక్క చేయకుండా నో చెప్పడంతో అంత షాక్ అవుతున్నారు. కెరీర్ బిగినింగ్ లోనే ఈమె వ్యవహారం ఇలా ఉందేంటి అని ఒకింత ఆశ్చర్య పోతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు