Mrunal Thakur : రూల్స్ బ్రేక్ చేస్తేనే మనమేంటో తెలుస్తుంది

రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “పిప్పా”. 1971 ఏ నేషన్ కమ్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉప శీర్షిక. బ్రిగేడియర్ బలరాం సింగ్ మెహతాగా ఇషాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 1971లో ఇండో – పాక్ యుద్ధ విజయంతో భారత్ కు కీలకంగా నిలిచిన యుద్ధ ట్యాంక్ పిప్పా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రోని స్క్రూవాలా, సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బలరాం సింగ్ రాసిన “ది బర్నింగ్ చాప్పీస్” ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరో ఇషాన్ కట్టర్ సోదరి పాత్రలో “సీతారామం” సినిమాతో ప్రేక్షకుల మది దోచుకున్న మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు చెల్లెలి పాత్ర చేస్తున్నందున ఇక ముందు ఇషాన్ పక్కన హీరోయిన్ గా నటించలేవు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై మృనాల్ ఠాకూర్ స్పందించింది.

“చెల్లెలు, లేదా భార్య పాత్రలలో నాయికలు నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయి అన్నది అపోహ మాత్రమే. రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మనమేంటో నిరూపించుకోవచ్చు. ఏ పాత్రలోనైనా ప్రేక్షకులని మెప్పించడమే నిజమైన ప్రతిభ. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ గొప్ప పాత్రను మిస్ అయ్యానని బాధపడొద్దు. ఈ చిత్రంలోని చెల్లెలి పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరయింది” అంటూ చెప్పుకొచ్చింది మృనాల్ ఠాగూర్. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఒదిగిపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు