Mrunal Thakur:నా లక్ష్యం అదే …

టాలీవుడ్ లో సీతారామం సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది మృనాల్. ఈ చిత్రంలోని సీత పాత్రలో ఒదిగిపోయి సినీ ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఏమాత్రం ఎక్స్పోజింగ్ కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 2012లో ముజ్ సె కుచ్ కేహేతి.. ఏ కమోషియన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఇక 2014లో విట్టిదండు అనే మరాఠీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. సీతారామం సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగులో నాని సరసన ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ ఠాకూర్ ఏదో ఒక భాషకే పరిమితం అయిపోకుండా జాతీయ తారగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. “నేను మొదట హిందీ సీరియల్స్ లో నటించా. అనంతరం సినిమాలు చేశాను. సీతారామం సినిమా ద్వారా తెలుగులో బ్రేక్ దొరికింది. భవిష్యత్తులో దక్షిణాది అన్ని భాషలలో నటించాలని ఉంది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఓటీటీల వల్ల గ్లోబల్ కంటెంట్ చూస్తున్నారు. అందుకే హీరోయిన్స్ కూడా అన్ని భాష చిత్రాల్లో నటిస్తూ జాతీయ తారలుగా ఎదగాలని కోరుకుంటున్నారు. నా ఆశయం కూడా అదే” అని చెప్పుకొచ్చింది. మరి పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలన్న ఈమె కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు