Mrunal Thakur: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నటి

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది. ఈ మూవీలో సీతగా నటించి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో చిరకాల ముద్రవేసింది. ఈ భామ నటన మరియు అందానికి తెలుగు ఆడియోస్ మీద అయ్యారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృనాల్…కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఈ తరుణంలోనే నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాని – మృణాల్ ఠాకూర్ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నాని ఒక్కో సినిమాకు 7 నుంచి 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. మృణాల్ ఠాకూర్ కూడా ఇంచుమించుగా నానితో సమానంగా అంటే ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి…. నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదట. కానీ ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ గురించి తెలుసుకున్న ఇతర నిర్మాతలు…. ఆమె వైపు కూడా వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదట. హీరోతో సమానం గా ఇవ్వడం చాలా కష్టమని కొంతమంది నిర్మాతలు… వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని టాక్. ఇలా మృణాల్ ఠాకూర్… నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. కాగా ఈ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి సూర్య సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు