Nag Aswin: ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం..

సినిమాపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.
సినిమా కొందరికి వ్యాపారం
ఇంకొందరికి వ్యాపకం
మరి కొందరికి సినిమాయే జీవితం.
ఒక్కో దర్శకుడు సినిమాను ఒక్కో ఉద్దేశ్యంతో తీస్తారు.

జనాలకు నచ్చే కథలను తీసేది కొందరు
తమకు నచ్చే కథలను తీసేది కొందరు
తమకు నచ్చిన కథను జనాలకి కూడా నచ్చేలా తియ్యగలిగే దర్శకులు కొందరు.
ఈ రోజుల్లో అలాంటి డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉన్నారు.
అందులో నాగ్ అశ్విన్ ఒకడు.

ఒకప్పుడు అసలు తెలుగు సినిమా స్థాయే వేరు

- Advertisement -

త్యాగరాజు ఉత్సవాలు జరుగుతున్నాయి,
శంకరశాస్త్రి గారు కచేరి కి కూర్చున్నారు,
ఒక పతిత వచ్చి కూర్చోగానే అందరు లేచి వెళ్ళిపోతారు,
చివరిగా మంజు భార్గవి కుడా వెళ్ళిపోతుంది,
కాని ఆ సినిమా చివర్లో అదే పతిత
పెట్టించిన కచేరి కి అందరు వస్తారు.
కచేరి అయిపోయాక శంకరశాస్త్రి చనిపోతారు,
ఆమె అతని పాదాలు దగ్గర పడి చనిపోతుంది,
అక్కడ అతని సంగీతానికి వారసుడు అని
పిల్లోడిని చూపిస్తాడు.

ఒక ఓడిపోయిన వాడు
సినిమా మొదట్లోనే చూపిస్తాడు,
నాట్యాన్ని కోరుకుంటాడు చివరివరకు
అతనికి ఆ నాట్యం దొరకదు,
అలానే చనిపోతాడు.
ఒక ఓడిపోయిన వాడి కథను మళ్ళి,మళ్ళి
జనాలు చూసారు.

ఒక గుడ్డివాడు పెద్ద సంగీత విద్వాంసుడు,
ఒక మూగపిల్ల బొమ్మలు వేస్తుంది,
రచనలు చేస్తుంది.
ముఖ్యమైన పాత్రలకు లోపాలను పెట్టి
కొన్ని లక్షల మందిని థియేటర్ కి తీసుకొచ్చారు
ఒక సిరివెన్నెల సినిమా ద్వార.

ఇవన్నీ కె. విశ్వనాథ్ గారు తనకు నచ్చిన కథలను ప్రజలకు నచ్చేలా చేయగలిగారు. ఇలా ఉదాహరణలు ఎన్నో చెప్పడానికి వందలు.
ఈ రోజుల్లో ఇటువంటి సినిమాను చూడగలమా అని అనుకున్న తరుణంలో “మహానటి” సినిమా వచ్చింది. చాలామందిని థియేటర్స్ కి నడిపించింది. మనసును కదిలించింది. దర్శకుడు పై గౌరవాన్ని అమాంతం పెంచేసింది.

 

మళ్ళీ అటువంటి దర్శకుడు నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న సినిమా ప్రేమికులకి “ప్రాజెక్ట్ కె” ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఆయన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా ఒకరికి రిప్లై ఇస్తూ “ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో కూడిన మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిపారు. అందరు ప్రాణం పెట్టి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.
ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొణె నటిస్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు