Amigos : డోప‌ల్ గ్యాంగ‌ర్ గా నందమూరి హీరో

బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలపై ప్రేక్షకులకు అభిప్రాయం మారిపోయింది. కళ్యాణ్ రామ్ ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉంటుందని, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. కాగా బింబిసార తర్వాత ఈ నందమూరి హీరో చేస్తున్న తాజా సినిమా అమిగోస్. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇందులో విభిన్న పాత్రలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నట్టు లీక్స్ వచ్చాయి. దీంతో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగాయి. ‘అమిగోస్’ ను డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

కాగా.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమిగోస్ మూవీ నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ మ‌రో పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ మీసాలు తిప్పుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. త‌న పాత్ర పేరు సిద్ధార్థ్ అని పోస్ట‌ర్‌లో తెలుస్తుంది. దానిపై మ‌నిషిని పోలిన మ‌నిషి అని అర్థం వ‌చ్చేలా డోప‌ల్ గ్యాంగ‌ర్ అని రాశారు. దానికి వెనుక అస‌లు విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

- Advertisement -

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు