Nani : కొత్త డైరెక్టర్ తో నాని కొత్త సినిమా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న హీరోల్లో నాని ఒకరు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తోపాటు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. నాని ఇటీవల ‘అంటే సుందరానికి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి రివ్యూలను తెచ్చుకుంది. కానీ, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

దీని తర్వాత నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని కంటే ముందు.. నాని నిర్మాణంలో వచ్చిన ‘హిట్ ది సెకండ్ కేస్’ చిత్రంమంచి హిట్ ను సాధించింది. ఈ చిత్రంలో నాని గెస్ట్ పాత్రలో మెరిశాడు. అంతే కాదు.. హిట్ 3 లో హీరో తానే అనే కన్ఫామ్ చేశాడు. ఇది ఇలా ఉండగా నాని తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఒక కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీకి నాని ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్ తో సాగుతుందట. అలాగే షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరగే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఇది నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా, పాన్ ఇండియా ఫిల్మ్ గా రాబోతుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ లో భాగమైన సీవీ మోహన్ నిర్మించబోతున్నారని సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు