Nani : ఉగాది బరిలో..

అంటే సుందరానికి తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నానికి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. తెలంగాణలోని గోదావని ఖని ప్రాంతంలో గల సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఒక మాస్ లవ్ స్టోరీగా దసరా తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది.

కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా విడుదల ఎప్పుడో అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై క్లారిటి ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా దసరా చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించారు.

వచ్చే ఉగాది కానుకగా దసరా సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 2023 మార్చి 30న థియేటర్ లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో నాని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే వెనకాల సిల్క్ స్మిత ఫోటో కనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు