Like, Share & Subscribe : ఈవెంట్ కు యంగ్ హీరో

సంతోష్ శోభ‌న్ హీరోగా నిహారిక బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ‘లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ చిత్రం గురించి తెలిసిందే. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా న‌టిస్తున్నారు.  ఇటీవ‌లే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లో ఫ‌రియా అబ్దుల్లాని సంతోష్ శోభ‌న్ క‌ల‌వ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం వంటి అంశాల‌ను చూపించారు. ఈ చిత్రంలో ప్రేమ క‌థాంశంగా తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది.  ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే జోరుగా ప్ర‌మోష‌న్లు జ‌రుగుతున్నాయి. టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఇటీవ‌ల బ్ర‌హ్మాజీ ఈ సినిమా చూసి న‌వ్వ‌కుండా ఉంటే డ‌బ్బులు వాప‌స్ ఇస్తామ‌ని కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తాజాగా లైక్‌, షేర్ అండ్ స‌బ్ స్క్రైబ్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. చీఫ్ గెస్ట్‌గా నేచుర‌ల్ స్టార్ నాని విచ్చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నుంది. మ‌రోవైపు ఈ సినిమా న‌వంబ‌ర్ 04న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభ‌న్‌, ఫరియా అబ్దుల్లా మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు, కామెడీ సీన్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయ‌ని చిత్ర బృందం పేర్కొంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు