Rashmika: నాపై వస్తున్న ఆ రూమర్స్ నిజమైతే…

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. తక్కువ కాలంలోనే ఈమె ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాన్ని కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం రష్మిక వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. తన ధైర్యమే తనని ఇంత పెద్ద స్టార్ ను చేసింది అని చాలా సార్లు చెప్పుకొచ్చింది రష్మిక.

అయితే యాక్టింగ్ కెరీర్ లో పుకార్లు రావడం సహజం. అవి రష్మిక జీవితంలో కూడా చాలానే ఉన్నాయి అని చెప్పవొచ్చు. రష్మిక సినీ కెరీర్ లో చాలా రూమర్స్ ను ఫేస్ చేసింది. ఒకటి తర్వాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ రూమర్స్ కి రష్మిక ఎప్పటికి అప్పుడు బదులు ఇస్తూనే ఉంటుంది. ఇలా తనని అందుకు టార్గెట్ చేస్తారో తెలీయదు అంటూ ఇది వరకే ఓ ఇంటర్వ్యూ చెప్పింది. రష్మికపై వచ్చే పుకార్లు తన కన్నా తన కుటుంబం పై ఎక్కువ ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది ఈ నేషనల్ క్రష్.

స్టార్ హీరోయిన్ కి పలు ప్రాంతాల్లో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయన వార్త చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై, కూర్గ్, హైదరాబాద్, గోవాతో పాటు బెంగుళూరులో కూడా రష్మికకు ఆస్తులు ఉన్నాయి అని… వాటి విలువ కోట్లలో ఉంటుంది అన్న వార్త వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రష్మిక కొట్టి పడేసింది. అలాగే ఈ పుకార్లు అన్ని నిజమైతే బాగుండు అంటూ ఓ కామెంట్ కూడా చేసింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు