Nayanthara: 10 కోట్ల కోసం బికినీకి సై అంటున్న నయనతార ?

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన నయనతార ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. 20 ఏళ్ల సినీ కెరీర్ లో నయనతారకు వచ్చిన అవార్డు.. హిట్స్.. బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి చెప్పుకొవాలంటే.. రోజులు చాలవు. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తుంది. అలాగే తన 20 ఏళ్ల కెరీర్ లో మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుక్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీన్నీ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి, నయనతార పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార బికినీలో కనిపించబోతుందట. బికినీతో పాటు కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఈ లేడీ సూపర్ స్టార్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకోసమే జవాన్ చిత్రానికి 10 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది.

10 కోట్ల కక్కుర్తి పడి బికినీలో నటించడానికి నయనతార ఒప్పుకుందా అనే విమర్శలు వస్తన్నాయి. పైగా నయనతార ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి కవలలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బికినీ ధరించి, బోల్డ్ సీన్స్ లో నటించడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

నయనతార కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ షో చేసింది. అప్పట్లో బెడ్ రూం సన్నివేశాలు, లిప్ లాక్స్ సీన్స్ లు చేసింది. అజిత్ తో వచ్చిన బిల్లా సినిమాలో బికినీలో కూడా కనిపించింది. కానీ, అప్పుడు నయనతారపై ఎలాంటి విమర్శలు రాలేవు. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ హోదా రావడం, పెళ్లై, కవలలు ఉన్న సమయంలో బికినీ, బోల్డ్ సీన్స్ అంటే ప్రేక్షకులు, అభిమానులు ఒప్పుకోవడం లేదు. అయితే జవాన్ లో నయనతార బికినీ, బోల్డ్ సీన్స్ చేస్తుంది అనేదానిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని కొంత మంది నయన్ అభిమానులు అంటున్నారు. ఇవి రూమర్స్ మాత్రమే అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి.. జవాన్ లో నయనతార ఎలాంటి పాత్ర చేస్తోందో..

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు