NBK108 : పూజతో పాటు ఫస్ట్ షెడ్యూల్

నందమూరి బాలయ్య ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను సంక్రాంతి రేసులో ఉంచడానికి టీం ప్లాన్ చేస్తోంది. అందుకోసం బ్యాలన్స్ గా ఉన్న సీన్స్ తో పాటు ఒక పాటను షూట్ చేస్తున్నారు. ఇది జరగడానికి చాలా టైం పట్టేట్టు ఉంది. ఇదిలా ఉండగా బాలయ్య NBK107 తోపాటు మరో సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల F3 తో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడితో బాలయ్య తన తర్వాత సినిమా చేస్తున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనిలో బాలయ్య మధ్య వయసు వ్యక్తిలా కనిపిస్తాడని, బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని అనిల్ రావిపూడి కన్ఫామ్ చేశాడు. అలాగే సోనాక్షి సిన్హా కూడా ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. కామెడీతో కూడిన యాక్షన్ సినిమాలు చేసే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నాడు అని తెలిసిన నాటి నుంచి నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK108 సినిమా పూజా కార్యక్రమం డిసెంబర్ 8న జరుగుతుందని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 8న కేవలం పూజా కార్యక్రమమే కాకుండా.. అదే రోజు ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారని సమాచారం. ఒక భారీ జైల్ సెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాట్టు టాక్. డిసెంబర్ 8 నుంచి 18 వరకు ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందని, 19 తర్వాత బాలయ్య తిరిగి వీర సింహా రెడ్డి సెట్స్ పైకి వెళ్తాడని సమాచారం.

- Advertisement -

NBK107కు గుమ్మడికాయ కొట్టిన తర్వాత మళ్లీ NBK108 రెండో షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా NBK108లో నందమూరి బాలయ్య నుంచి మాస్ ఎలివేషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్, బాలయ్య టైమింగ్ కామెడీ కూడా ఉండటం ఖాయం. ఇది నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వడం కూడా ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు