#NBK108: ముహూర్తానికి సిద్ధం

అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు డబుల్ హ్యాట్రిక్‌ విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటిచిత్రం #NBK108 (వర్కింగ్ టైటిల్) ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి రేపు ముహూర్తం జరుపుకుంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు 9:36 AM సినిమా ముహూర్తం జరగనుంది. #NBK108 రెగ్యులర్ షూట్ కూడా రేపే ప్రారంభమవుతుంది. ఇందుకోసం భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతుంది .

ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీ లీల ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసి మంచి హిట్ అందుకున్న అనిల్ ఈ సారి బాలయ్య ఎంతటి కమర్షియల్ హిట్ సినిమాను అందుకుంటాడో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు