NBK108: సోనాక్షి సిన్హా క్లారిటీ

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2010లో సల్మాన్ ఖాన్ తో దబాంగ్ అనే సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రిన్ కు ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కానీ ఈ భామకు ప్రస్తుతం పెద్దగా కలిసిరావడం లేదు. గత ఏడాది అజయ్ దేవగన్ తో భుజ్ : ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేసింది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా డబుబ్ XL అనే చిత్రంలో నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది.

అయితే సినాక్షి సిన్హా గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది. నందమూరి నటసింహ బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చే NBK108లో హీరోయిన్ పాత్రకు సోనాక్షి సిన్హా ఎంపిక అయిందని. ఇప్పటికే మూవీ యూనిట్ కు సోనాక్షికి మధ్య చర్చలు జరిగాయని, అవి సక్సెస్ కావడంతో ఈ బాలీవుడ్ బ్యూటీ బాలయ్యకు జోడీగా ఫిక్స్ అయిందని విపరీతంగా వార్తలు వచ్చాయి.

అలాగే ఈ మధ్య.. ఈ సినిమా నుంచి సోనాక్షి ని తొలగించారని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా సోనాక్షి సిన్హా ఇన్ స్టాగ్రామ్ స్ట్రోరీలో స్పందించింది. తాను NBK108 చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెల్చి చెప్పింది. ఆ చిత్ర యూనిట్ వాళ్లు ఇప్పటి వరకు తనను సంప్రదించాలేని స్పష్టం చేసింది. తాను ఆ సినిమాలో చేయడమే లేదు.. ఎలా తొలగిస్తారు అంటూ ప్రశ్నించింది. సోనాక్షి సిన్హా ఇచ్చిన క్లారిటీతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ కు బ్రేక్ పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు