NBK108: ఉగాది రోజున అప్డేట్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమా బ్లాక్బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ లో బాగా వసూళ్లు రాబట్టింది. దీని తరువాత అనిల్ రవిపూడి దర్శకత్వంలో తదుపరి సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమా లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, కాజల్ కూడా ఈ సినిమాలో నటింస్తుందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, బాలయ్య పక్కా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. దీనితో బాలయ్య ని ఇప్పటి వరకు చూడని విధంగా చూడబోతున్నాం అని తెలుస్తుంది. అలాగే, హిందీ నటి నోరా ఫతేహి ని కూడా ఈ చిత్రంలో తీసుకోవాలి అని చేస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజా సమాచారం వినిపిస్తుంది. ఉగాది సందర్భంగా, 22 మార్చ్ న, ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని నిర్ణయించిన మేకర్స్, అందుకోసం బాలయ్య తో స్పెషల్ ఫోటో షూట్ చేస్తున్నారని తెలిసింది. ఇది వరకే బాలయ్య ఆన్ సెట్ లుక్ లీక్ అయింది, యాష్ మాస్టర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ట్రోల్ మాటేరియల్ గా మారినప్పటికీ, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఫ్యాన్స్ లో బాగా ఉంది. ఫస్ట్ లుక్ కూడా అలానే ఉంటుందా? లేదా ఊహించని రేంజ్ లో విడుదల చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉండు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు