NC22 : శివ ఆవేశాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో బంగర్రాజు మినహా రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. బాలీవుడ్ లో చేసిన తొలి సినిమా లాల్ సింగ్ చడ్డా ఫెయిల్ అయినా, ఈ యువ సామ్రాట్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉండగా నాగ చైతన్య తన కెరీర్ లో 22వ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు ద్వి భాష చిత్రంగా వస్తున్న NC22 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా NC22 కి సంబంధించి ఒక అప్డేట్ ను మూవీ టీం రిలీజ్ చేశారు. బుధవారం నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా NC22 టైటిల్ ను ప్రకటించబోతున్నట్టు తెలిపారు. అలాగే నాగ చైతన్య ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నాట్టు అనౌన్స్ చేశారు. అలాగే ఈ రోజు NC22 కి సంబంధించి ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నాగ చైతన్యను కొంత మంది బలంగా పట్టుకుని ఉన్నారు. దీనికి “అతని ఆవేశాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు” అంటూ ఓ క్యాప్షన్ ను జోడించారు. అలాగే ఈ పోస్టర్ తో NC22 సినిమాలో నాగ చైతన్య.. శివ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతుంది. కాగా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా బుధ వారం ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు