NC22 : పవర్ ఫుల్ వైబ్స్

అక్కినేని నాగ చైతన్య తన దైన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవల విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ మూవీ మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బాలీవుడ్ లో మొదటి సారి చేసిన లాల్ సింగ్ చడ్డా కూడా నిరాశపరిచింది. దీంతో తర్వాతి సినిమా నాగ చైతన్య ఫుల్ ఫోకస్ పెట్టాడు. 

నాగా చైతన్య చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో వెంకట్ ప్రభుతో ఒకటి, మరొకటి పరశురాం దర్శకత్వంలో ఉంది. అయితే ముందుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చే సినిమానే ఉంటుందని అందరికీ తెలుసు. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇది తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రాబోతుంది. ఇటు నాగ చైతన్యకు అటు వెంకట్ ప్రభుకు ఇది తొలి ద్వి భాషా చిత్రం. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేడ్ ను మేకర్స్ ప్రకటించారు. రేపటి నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్స్ సిటీలో NC22 షూటింగ్ ప్రారంభ కానుందని అధికారికకంగా ప్రకటించారు. “అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్స్” అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది.

- Advertisement -

నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌ లు ఉండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ తో ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. కాగా ఈ కాంబినేషన్ ఇప్పటికే బంగార్రాజు సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు