Nidhi Agerwal: ఇక టాప్ హీరోయిన్ అవ్వటానికి సర్వం సిద్ధం

సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. వీటి తర్వాత కోలీవుడ్ రెండు ఛాన్స్ లను కూడా కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లులోనే లీడ్ రోల్ ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ, నిధి అగర్వాల్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల కాకముందే.. నిధికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవల సినిమా ఛాన్స్ లు లేక ఇబ్బంది పడ్డ ఈ భామ, ప్రస్తుతం దర్శక నిర్మాతల కంట పడుతుంది. పవర్ స్టార్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా డిలక్స్ లో కూడా నిధికి లక్కీ ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా.. మెయిన్ లీడ్ మాత్రం నిధిదే అని సమాచారం. దీంతో ఈ బ్యూటీకి మరింత డిమాండ్ పెరిగిపోతుంది. పవన్, ప్రభాస్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అని అందరికీ తెలుసు. ఈ సినిమాలు హిట్ అయితే, నిధి అగర్వాల్ కు క్రేజ్ పెరుగుతుంది. అలాగే తన రెమ్యునరేషన్ ను కూడా పెంచుతుంది.

అలా జరగముందే, ఈ రెండు సినిమాలు విడుదల కాక ముందే నిధి అగర్వాల్ తో కొన్ని సినిమాలకు సైన్ చేయించుకోవాలని పలువరు దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పటి వరకు రెండు సినిమాలకు నిధి అగర్వాల్ సైన్ కూడా చేసిందట. అందే కాదు.. మరో సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. పవన్, ప్రభాస్ సినిమాలు రిలీజ్ కాకముందే, ఇలా వరుసగా అవకాశాలు కొట్టేస్తున్న నిధి అగర్వాల్.. సినిమాల రిలీజ్ తర్వాత ఎలాంటి స్థితిలో ఉంటుందో అని ప్రేక్షకులు గుస గుసలు పెడతున్నారు.

- Advertisement -

For More Updates :

 

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు