Niharika: నిహారిక విడాకుల వార్తలకు కారణం ఇదేనా..?

గత నాలుగు రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. నిహారిక ఎంత అల్లరి పిల్ల అనేది మనకు తెలిసిందే. మెగా హీరోలు ఎంతమంది ఉన్నా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నిహారిక. 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది.

వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి పెళ్లిని నాగబాబు ఎంత వైభవంగా చేశారో ఇప్పటికీ మరచిపోలేరు. అయితే పెళ్ళై మూడేళ్లు కూడా గడవకముందే వీరి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటూ.. చైతన్య పెళ్లి ఫోటోలు అన్ని డిలీట్ చేశాడు. అంతేకాకుండా పెళ్లయిన కొత్తలో ఫోటోలను షేర్ చేసిన ఈ జంట.. ఇప్పుడు అసలు తమ ఫోటోలను షేర్ చేయడం లేదు.

అంతేకాకుండా పార్టీలలో, సినిమా ఈవెంట్లలో కూడా కనిపించడం లేదు. దాంతో చైతన్య – నిహారిక విడాకుల వార్తలకు ఆజ్యం పోసినట్టయింది. అయితే నిహారికను పెళ్లి చేసుకోవడానికంటే ముందే చైతన్య ఆమెకి ఓ కండిషన్ పెట్టాడంట. పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదని కండిషన్ తో పెళ్లి చేసుకున్నాడట. కానీ నిహారిక, చైతన్య కండిషన్ ను పక్కనపెట్టి ఒక వెబ్ సిరీస్ లో కీలకపాత్రలో కనిపించింది. ఇది నచ్చకపోవడంతో చైతన్య విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విడాకుల వార్తలపై నిహారిక, చైతన్య ఇంతవరకు స్పందించలేదు.. అలాగే ఖండించనూ లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు