Niharika: ఆ ఒక్క ఫోటో మాత్రం తొలగించని మెగా అల్లుడు!

మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ అనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ను 2020 డిసెంబర్ 9న పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాల ఈ జంట బాగానే కలిసింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు సంభవించాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా చైతన్య, నిహారికల విడాకుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

దానికి కారణం ఇన్ స్టాగ్రామ్ లో వీరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, అలాగే ఇద్దరు తమ ఖాతాల్లో తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకోవడం వల్లనే అని చెప్పాలి. అంతేకాదు నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా చైతన్య అకౌంట్ లో లేదు. మెగా ఫ్యామిలీ లో చైతన్య అందరిని ఫాలో అవుతున్నాడు నిహారికని తప్ప. దీంతో వీరు ఈసారి కచ్చితంగా విడాకులు తీసుకునే దిశగా ముందుకు వెళుతున్నట్టు చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, అయితే ఒక ఫోటో మాత్రం అలాగే ఉంచాడు చైతన్య జొన్నలగడ్డ. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్ల బజ్ తో నిహారిక దిగిన ఫోటో అతడు ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికీ ఉంది. ఈ ఫోటో 2020 డిసెంబర్ 18న అప్లోడ్ చేశాడు. ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు మొదలైన నేపథ్యంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు