Nithin: మారేడు మిల్లిలో నితిన్ సినిమా

యంగ్ టాలెంటెడ్ హీరో నితిన్ ప్రస్తుతం ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. కావాల్సినంత టాలెంట్ ఉన్న కూడా విజయాలు వరించడం లేదు. నితిన్ ఇదివరకే దాదాపు 10 కి పైగా వరుస ప్లాప్ సినిమాలు రుచి చూసాడు. ఆ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో మంచి అందుకున్నాడు.

ప్రస్తుతం అదే ఆలోచనతో వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ తన 32వ చిత్రాన్ని మొదలుపెట్టాడు. నితిన్ చివరి చిత్రం మాచర్ల నియోజకవర్గం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నితిన్ చేస్తున్న ప్రస్తుత చిత్రం, రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మారేడుమిల్లి ఫారెస్ట్‌లో లో జరుగుతుంది. నితిన్‌తో పాటు చిత్రబృందం సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది. 2022 ఏప్రిల్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు నిన్ననే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా, శ్రీలీల కథానాయికగా నటించారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు