Nithya Menen : అతన్నే పెళ్లి చేసుకుంటా..

నిత్యామీనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన నటనతో, అందంతో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది నిత్యామీనన్. ఈ బ్యూటీ.. అన్ని భాషల చిత్రాలలో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కెరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తుంది. అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా ఇష్క్ సినిమా సూపర్ హిట్ అవడంతో అభిమానులకు మరింత దగ్గరయింది.

ప్రస్తుతం సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోలకు జడ్జిగా సైతం వ్యవహరిస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. ఇక తాజాగా భీమ్లా నాయక్ తో పాటు ఇటీవల తిరు సినిమాతో మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చింది నిత్య. ఇక ఈమె కెరీర్ విషయం పక్కన పెడితే.. 34 ఏళ్ల నిత్యామీనన్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా తనకు ఎలాంటి వాడు కావాలో వివరించింది నిత్యమీనన్. ఆమె మాట్లాడుతూ.. ” నేను ఇండియా వేదిక్ కల్చర్ ని బాగా నమ్ముతాను. పెళ్లి అంటే ఒక సోషల్ సెటప్. అంటే ఫైనాన్షియల్ గా ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. దానికి మించి ఏదైనా ఉంటే ఆలోచిస్తా. దానికి మించి ఆలోచించే వాళ్ళు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా ” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు