Tollywood: ఇండియన్ సినిమా అంటే.. ఇక తెలుగు సినిమానే..

అంతర్జాతీయ వేదికలపై భారత చలన చిత్ర పరిశ్రమ.. అంటే బాలీవుడ్ అనే భావించేవారు. బాలీవుడ్ నటీనటులకు ప్రపంచ సినిమాలో ఇతర ఇండస్ట్రీ వారితో పోల్చితే మంచి గౌరవం దక్కేది. అలాంటి బాలీవుడ్ ప్రస్తుతం కూదేలు అయిపోయింది. భారత చలన చిత్ర పరిశ్రమకు ప్రైడ్ గా ఉండే బాలీవుడ్ నుంచి సరైనా సినిమాలు రావడం లేదు. అంతే కాకుండా నిత్యం ఏదో ఒక వివాదం బాలీవుడ్ మెడకు చుట్టుకుంటున్నాయి. దీని వల్ల బాలీవుడ్ మరింత దీన స్థితి చేరుకుంటుంది.

ఇదే సమయంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇవి కేవలం సౌత్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. హిందీ బెల్ట్ రాష్ట్రాల ఆడియన్స్ ను కూడా ఆట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు నార్త్ మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. బాహుబలి, పుష్పతో పాటు ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలు సినీ ప్రపంచాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపునకు తిప్పేలా చేశాయి.

ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టిన నాటి నుంచి టాలీవుడ్ నలుమూలల వినిపిస్తోంది. ఆస్కార్ ఈవెంట్ లో భారతీయ సినిమా బాలీవుడ్ అంటూ కొంత మంది సెలబ్రెటీలు పలికినా.. దాని ప్రభావం పెద్దగా లేదని చెప్పొచ్చు. ఇంగ్లీష్ సినిమాల్లో నటించడానికి రామ్ చరణ్, తారక్ ను హాలీవుడ్ ప్రముఖులు సంప్రదిస్తున్నారంటే.. టాలీవుడ్ ఘనత ఎక్కడి వరకు వెళ్లిందో తెలుస్తోంది.

- Advertisement -

ఇక భారతీయ సినిమా అంటే.. బాలీవుడ్ కాదు.. టాలీవుడ్ అని చెప్పుకునే రోజులు అతి త్వరలోనే రానున్నాయని చెప్పొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు