Naga Shaurya : ముహుర్తం ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో నాగ‌శౌర్య ఒక‌రు. ఇటీవ‌లే ‘కృష్ణ‌వింద విహారి’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాడు.   ఈ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది.  థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే నెటిఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ  యువ హీరో మరో సరికొత్త సినిమాని ప్ర‌క‌టించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. నాగ‌శౌర్య ‘NS24’ ని అధికారికంగా ప్ర‌క‌టించింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.అరుణాచ‌లం ద‌ర్శ‌క‌త్వం వహించబోతున్నాడు.

ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాలో నాగ‌శౌర్య కొత్త లుక్‌తో క‌నిపించ‌నున్నాడు. వైష్ణ‌వి ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1 గా వ‌స్తున్న ఈ చిత్రానికి శ్రీ‌నివాస‌రావు చింత‌ల‌పూడి, విజ‌య్ కుమార్ చింత‌ల‌పూడి, డాక్ట‌ర్ అశోక్ కుమార్ చింత‌ల‌పూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేబి అధ్వైత, భ‌విష్య స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 06న రామానాయుడు స్టూడియోలో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనున్న‌ట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో చాలా బిజీగా ఉన్నారు. ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి, నారి నారి న‌డుమ మురారి, పోలీస్ వారి హెచ్చ‌రిక వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల‌న్ని షూటింగ్ ద‌శ‌లో కొన‌సాగుతున్నాయి. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు