NTR : స్నేహం కోసం..

గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ లో అక‌స్మాత్తుగా పునీత్ రాజ్ కుమార్ తిరిగిరాని లోకాలకు వెళ్లిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది జ‌రిగిన అత్యంత విషాద‌క‌ర సంఘ‌ట‌న ఇదే అని చెప్పాలి. క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్‌కి కోట్ల‌లో అభిమానులున్నారు. ఇప్ప‌టికీ అభిమానులు పునీత్ మృతిని జీర్ణించుకోలేకున్నారు. ఇవాళ్టితో పునీత్ మ‌ర‌ణించి ఏడాది గ‌డుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ గొప్ప న‌టుడు మాత్ర‌మే కాదు.. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. పునీత్ సేవ‌ల‌ను గుర్తిస్తూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం “క‌న్న‌డ‌ర‌త్న‌” అనే బిరుదుని ప్ర‌క‌టించారు.

న‌వంబ‌ర్ 01న క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై ఆధ్వ‌ర్యంలో ఈ బిరుదు అందించ‌బోతున్నారు. ఇందుకోసం భారీ బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు పునిత్ జ్ఞాప‌కార్థం న‌వంబ‌ర్ 01న బెంగళూరులో నిర్వ‌హించే  ‘కన్నడ రాజ్యోత్సవం’ స‌భ‌లో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగులు క‌లిగిన ఫైబ‌ర్ గ్లాస్ విగ్ర‌హాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ర‌విచంద్ర‌, శ్రీ‌హ‌ర్ష క‌లిసి భారీ విగ్ర‌హాన్ని త‌యారు చేస్తున్నారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాల‌జీ తో ఈ విగ్ర‌హాన్ని త‌యారు చేశారు.

చాలా మంది సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు అతిథులుగా హాజ‌రుకానున్నారు. సౌత్ నుంచి ఇద్ద‌రూ బిగ్ స్టార్లు హాజ‌రుకానున్నారు. వారిలో ఒక‌రు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కాగా.. మ‌రొక‌రు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో ఎన్టీఆర్ వేదిక పంచుకోవ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్టీఆర్‌కి పునీత్ రాజ్ కుమార్‌కి మ‌ధ్య మంచి అనుబంధమే ఉంది. పునీత్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు. ముఖ్యంగా నంద‌మూరి ఫ్యామిలీకి, పునీత్ కుటుంబానికి ద‌శాబ్దాలుగా మంచి రిలేష‌న్ కొన‌సాగుతుంది. నందమూరి బాల‌కృష్ణ కూడా పునీత్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ రిలేష‌న్ ఇలాగే కొనసాగాల‌ని ఆకాంక్షిద్దాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు