NTR30: షూటింగ్ కు సర్వం సిద్ధం..

నందమూరి వారసుల్లో ది మోస్ట్ సక్సెస్ హీరో అంటే Jr ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. కళ్యాణ్ రామ్, తారక రత్న తో పోలిస్తే Jr ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక RRR సినిమాతో ప్రపంచమంతటా ఖ్యాతిని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. “కొమురం భీముడొ” పాటలో.. ఎన్టీఆర్ నటనకి విమర్శకులు కూడా ప్రశంశలు కురిపించారు. ఆస్కార్ వరకు వెళ్లిన ఎన్టీఆర్ ప్రయాణం .. ఇంకా అంత దూరం వెళ్లనుందో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చే సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించగా ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంది. ఎన్టీఆర్ 30 షూటింగ్ కొని అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితుంది.. ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ మార్చి 20 నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు దర్శకుడు కొరటాల శివ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాడని గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే NTR31 పై కూడా ఆసక్తికరవార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుందని సమాచారం. సెప్టెంబర్ లో సెట్స్ వర్క్ ను ప్రారంభించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న “సాలార్” సినిమా పనుల్లో లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కేజీఎఫ్3 ఉండే అవకాశాలు ఉన్నాయని నిర్మాత విజయ్ కిరంగదుర్ వెల్లడించారు.

మరి సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసే తర్వాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31 అయి ఉంటుందా ? లేదా కేజీఎఫ్ 3 ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు